నీటి సరఫరాను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

నీటి సరఫరాను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

 విశ్వంభర, మిర్యాలగూడ : ప్రజలకు వేగవంతంగా శుద్ధమైన తాగునీరు అందించాలని మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ , వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ అధికారులకు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకు మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధ బాలకృష్ణ , వైస్ చైర్‌పర్సన్  గుడిపాటి శిరీష నవీన్, మున్సిపల్ కమిషనర్, డి.ఈ, ఏ.ఈ, మరియు వాటర్ వర్క్స్ అధికారులు కలిసి వాటర్ బేస్ వద్ద ఉన్న నీటి ఫిల్టర్ బాడీలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి నాణ్యత, సరఫరా విధానం  సాంకేతిక సమస్యలను సమీక్షించి, ప్రజలకు శుద్ధమైన తాగునీరు నిరంతరం అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే, వాటర్ బెడ్ 1 మరియు 2లను తక్షణమే శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. అమృత పథకం కింద నిర్మాణంలో ఉన్న కొత్త వాటర్ ట్యాంకులను కూడా ప్రత్యక్షంగా పరిశీలించి, పనుల నాణ్యతను తనిఖీ చేసి, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్  కమిషనర్, పలువురు మున్సిపల్ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: