విద్యార్థులకు వాటర్ బాటిళ్ల  వితరణ

విద్యార్థులకు వాటర్ బాటిళ్ల  వితరణ

విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని ఆలేరు జిల్లాపారిశుత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న స్కూల్ అసిస్టెంట్, ఆంగ్ల ఉపాధ్యాయిని కవిత ఆ స్కూల్ విద్యార్థులకు వేసవి దృష్ట్యా వాటర్ బాటిల్స్ వితరణ చేశారు. ఒక్కోటి రూ.150 విలువగల బాటిళ్లను  120మందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ, ఆ పాఠశాల హెచ్ఎం ఆంగోతు రాందాస్ మాట్లాడుతూ,  పాఠశాలలోని విద్యార్థులకు వాటర్ బాటిల్స్ బహుకరించడం అభినందనీయమని ఇంగ్లీష్ టీచర్ కవితను అభినందించారు. ఆమె ఉదారతను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: