బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఐలు అభ్యర్ధుల గెలుపు

బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఐలు అభ్యర్ధుల గెలుపు

విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో, ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఇద్దరు అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది. మందడం శ్రీనివాసరావు,  సిహెచ్ శైలజ పోటీ చేసిన ఇద్దరు కూడా గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని బార్ అసోసియేషన్లో స్వీట్లు పంచి వేడుక చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకటరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి మజీద్, ఉపాధ్యక్షులు యాదాసు యాదయ్య, హనుమంతు గౌడ్, ఐలు జిల్లా ఉపాధ్యక్షులు జగతయ్య, కేమ రామదాసు, బాతరాజు అశోక్ కుమార్, డేవిడ్, దినేష్, నోముల స్వామి, సతీష్ రెడ్డి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Tags: