డ్రగ్స్ నివారణపై అవగాహన
On
విశ్వంభర, నెల్లికుదురు: రోడ్ సేఫ్టీ, గంజాయి, మాదకద్రవ్యాలు నివారణపై స్థానిక ఎస్సై చిర్ర రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు నెల్లికుదురు మండలం నరసింహుల గూడెంలో గ్రామస్తులకు మంగళవారం అవగాహన కల్పించారు. స్థానిక సర్పంచి గొడుగు జ్యోతి రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై పాల్గొని మాట్లాడుతూ విలువైనదని హెల్మెట్ ధరించి బైకులు నడపాలన్నారు. వేగం కన్నా గమ్యం ముఖ్యమని అతివేగం ప్రాణాంతకమని అన్ని వాహనదారులకు సూచించారు.గంజాయి,డ్రగ్స్ వంటి మారకద్రవ్యాల జోలికి వెళ్ళొద్దని వీటికి అలవాటు పడితే జీవితాలు చిద్రమవుతాయన్నారు.బయటకి రావడం కష్టమని హెచ్చరించారు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు నీ దరి చేరనీయ వ్వొద్దని సూచించారు.క్రయవిక్రయాలకు పాల్పడినా వీటిని వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని జైలు పాలయితారని హెచ్చరించారు.గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బైకులు నడిపే వాళ్ళం హెల్మెట్లు ధరిస్తామని, కారులో సీల్ బెల్ట్ పెట్టుకుంటామని,గంజాయి డ్రగ్స్ వంటి మారకద్రవ్యాల జోలికి వెళ్ళమని, ఎవరైనా అమ్మకానికి,కొనడానికి పాల్పడిన వాడిన సమాచారం అందిస్తామని,సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటామని నరసింహుల గూడెం గ్రామస్తులు తీర్మానం చేసి డాక్యుమెంట్ ను ఎస్సై రమేష్ బాబుకు అందజేశారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేసాల కృష్ణయ్య పంచాయితీ కార్యదర్శి మణిదీప్, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. నెల్లికుదురు ఎస్ఐ చిర్రా రమేష్ బాబు ఆధ్వర్యంలో మండలంలోని రామన్నగూడెం,కాచికల్ గ్రామాలలో పోలీసులు గ్రామస్తులతో కలిసి నో హెల్మెట్ నో ఎంట్రీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాహన ప్రయాణదారుల ప్రాణాల కు ముప్పు వాటిల్లకూడదని హెల్మెట్స్ ధరించిన వారికి గ్రామాలలో ప్రవేశం లేదని ఫ్లెక్సీ లు బాధ్యతను గుర్తు చేసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.



