నాచారం చెరువు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

నాచారం చెరువు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

విశ్వంభర, తార్నాక : హైడ్రా రెండో విడతలో చేపడుతున్న చెరువుల పునరుద్ధరణలో భాగంగా నాచారం పెద్ద చెరువును కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. చెరువులో గుర్రపు డెక్క వ్యాపించి నీటి నిల్వ లేకపోవడాన్ని గమనించి, మురుగు నీటిని తొలగించి పూడికను పూర్తిగా తీసేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికులు చెరువు పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ, మురుగు నీరు కలవడంతో దోమల సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. చెరువును అభివృద్ధి చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మీర్జాలగూడ చిన్మయి మార్గ్ ప్రాంతంలో వరద ముప్పును కమిషనర్ పరిశీలించారు. కాలువలు కుంచించుకుపోవడంతో వరద నీటి ప్రవాహం సరిగా సాగడంలేదని గుర్తించారు. కాలువల విస్తరణ లేదా కొత్త కాలువ నిర్మాణంపై పరిశీలించి పనులు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో వర్ల పాపయ్య, సంచిత్ గంగ్వార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: