ప్లాస్టిక్ వ్యర్ధాల పై అవగాహన కార్యక్రమం
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల పట్ల అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్ పదార్థాలను వాడకుండా వాటికి బదులుగా బట్టతో లేదా చెక్కతో తయారుచేసిన వస్తువులను మాత్రమే ఉపయోగించడం మంచిదని అన్నారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి సాధ్యమవుతుందని అన్నారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ప్రాజెక్ట్ విశ్లేషకులు డి.తేజస్వి, ఎన్.అజిత్ మాట్లాడుతూ, ఈనాడు ప్లాస్టిక్ భూతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న సందర్భంలో దాని నుండి ప్రాణికోటి బయట పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్లాస్టిక్ తో కాకుండా బట్టతో, చెక్కతో తయారుచేసిన గ్లాసులు, సీసాలు, సంచులు, చెంచాలు మొదలగు వాటిని ఉపయోగించడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టిన వాళ్లమవుతాం, ఆరోగ్యాన్ని రక్షించుకున్న వాళ్ళమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె.చిన్న బాబు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి టి.శ్రీనివాస్, అధ్యాపకులు డాక్టర్ జి.సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ సిహెచ్.వెంకట్ గౌడ్, డాక్టర్ డి.కిషన్, డాక్టర్ పి.బ్రహ్మం, డాక్టర్ ఎం.రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ళ శ్రీను, అమర్, బాలరాజు, నరేష్, ఆంజనేయులు, రాధిక, రవితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.



