అక్రమ పచ్చళ్ల తయారీపై దాడి.. ఒకరు అరెస్ట్

విశ్వంభర, జియాగూడ : జియాగూడ వెంకటేష్ నగర్‌లో అక్రమంగా పచ్చళ్లు తయారు చేస్తున్న కేంద్రంపై గోల్కొండ టాస్క్ ఫోర్స్, కుల్సుంపురా పోలీసులు దాడి చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. అనుమతులు లేకుండా అపరిశుభ్ర వాతావరణం లో పచ్చళ్లు తయారు చేసి మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దాడిలో భారీగా పచ్చళ్ల డ్రములు స్వాధీనం చేసుకోగా, వాటి విలువ రూ.3 లక్షలు గా అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags: