బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం
On
విశ్వంభర,సిద్దిపేట: చిన్నకోడూరు, నంగునూర్ మండలాల్లో మృతిచెందిన పలువురు బాధిత కుటుంబాలను యువ నాయకుడు, పారిశ్రామికవేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి పరామర్శించారు. నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామానికి చెందిన సంగు ఆంజనేయులు అనారోగ్యంతో మృతిచెందడంతో కుటుంబసభ్యులకు అండగా నిలిచారు. గ్రామ సర్పంచ్ సంగు పురేందర్ ద్వారా విషయాన్ని తెలుసుకున్న రాజేశ్వర్ రెడ్డి రూ.5వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. గ్రామానికి చెందిన నర్సింలు గౌడ్, బెదురు మల్లేశం, పెద్ది రాజు, శివరామ్, బాలకిషన్, సిద్ధులింగం, మహేందర్లు రాజేశ్వర్ రెడ్డి పంపించిన ఆర్థికసాయాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. చిన్నకోడూరు గ్రామానికి చెందిన బంక వెంకవ్వ అనారోగ్యంతో మృతిచెందడంతో మంగళవారం కుటుంబసభ్యులను పరామర్శించి రూ.5వేల ఆర్థికసాయం అందజేశారు. అల్లీపూర్ గ్రామానికి చెందిన మహంకాళి ఎల్లయ్య అనారోగ్యంతో మృతిచెందడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5వేల ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో రాజు చారగొండ, మూర్తి, రుచిత్ రెడ్డి, విజేందర్ రెడ్డి, అజయ్, తిరుపతి, కప్పెర రోజా తదితరులు పాల్గొన్నారు.



