జాతీయ సదస్సులో ప్రతిభ కనపరిచిన భాను కిరణ్

జాతీయ సదస్సులో ప్రతిభ కనపరిచిన భాను కిరణ్

విశ్వంభర, సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన డాక్టర్ శికిలమెట్ల భాను కిరణ్ జాతీయ స్థాయి వైద్య సదస్సులో మెరిశారు. ఏపీలోని కాటూరి మెడికల్ కళాశాలలో నిర్వహించిన నేషనల్ కాన్ఫరెన్స్‌లో, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం నుండి ఆమె చేసిన పోస్టర్ ప్రెజెంటేషన్‌కు ద్వితీయ బహుమతి లభించింది.ప్రస్తుతం ఆమె ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో పీజీ చదువుతున్నారు. కళాశాలకు కీర్తి తెచ్చినందుకు గాను ప్రిన్సిపల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు,అధ్యాపకులు ఆమెను అభినందించారు. తన కుమార్తె సాధించిన విజయం పట్ల తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి విజయ హర్షం వ్యక్తం చేశారు.

Tags: