ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధించాలి: ఎస్ ఐ రమేష్ బాబు
విశ్వంభర, నెల్లికుదురు: ఎంచుకున్న లక్ష్యాల సాధనకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఎస్సై చిర్ర రమేష్ బాబు యువతకు పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా యువజన క్రీడా వారోత్సవాలు పురస్కరించుకొని మండల కేంద్రం నెల్లికుదురులో సోమవారం నిర్వహించిన 2కే రన్ లో ఎస్సై తో పాటు, స్థానిక సర్పంచి పులి వెంకన్న, ఎంపీవో పద్మ వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, వ్యాయామం, యోగ, క్రీడలలో ఆసక్తిని పెంపొందించుకొని ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు. నిరంతరం ఫిట్నెస్ ను కాపాడుకోవాలని సూచించారు. ఆరోగ్యంగా ఉంటే మానసిక ఉల్లాసంతో పాటు జ్ఞాపకశక్తి పెరిగి ఏకాగ్రత అలవడుతుందన్నారు.డ్రగ్స్, మద్యపానం,గంజాయి వంటి మరకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్నారు. యువతతోనే సమైక్యత పెంపొంది దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు,అంగన్వాడీ టీచర్లు, యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు.