మారోజు వీరన్న వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు -ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు
విశ్వంభర, హైదరాబాద్ :- ఉస్మానియా యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మనబోయిన సైదులు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరన్న వర్ధంతి కార్యక్రమం లో ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా వీరన్న చిత్రపటానికి పూల మాల తో నివాళులు అర్పించి వర్ధంతి కార్యక్రమం ను నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సామజిక న్యాయం, సమానత్వం సమాజ నిర్మాణం, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప విప్లవ కారుడు అని వారు తెలిపారు.మారోజు వీరన్న ఒక వ్యక్తి కాదు సామాజిక చైతన్య ప్రతీక అని దళిత, బహుజనులు, ఆదివాసీలు, మహిళలు హక్కుల కోసం పోరాటం చేసిన ఉద్యమం వీరుడు అని వారు తెలిపారు.సమాజంలో అసమానతలు, దళిత బహుజనులు, రాజ్యాధికారం కావాలి అని దళిత, బహుజన మహాసభ ను ఏర్పాటు చేయడం జరిగింది. అని వారు పేర్కొన్నారు.కుల నిర్ములన వ్యవస్థ కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప త్యాగ శీలి వీరన్న అని వారు అన్నారు.కుల నిర్ములన, దళిత బహుజనులు ఉద్యమం, మండల్ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం లో మమేకం అయినారు.భౌగోళిక తెలంగాణ రాష్ట్రము లో బహుజనుల కి సామాజిక తెలంగాణ ఏర్పాటు కావాలని ఉద్యమం చేపట్టినారు.భౌగోళిక తెలంగాణ రాష్ట్రము లో బహుజనులకు రాజ్యాధికారం కావాలని లక్ష్యం తో తెలంగాణ మహాసభ ను ఏర్పాటు చేసినారు.వీరన్న జనశక్తి పార్టీ లో కూడా దళిత బహుజనులు కమ్యూనిస్ట్ పార్టీ గా పరివర్తనం చేయాలని 1997 మే 17 నుండి 1998 వరకు పార్టీ లో అంతర్గత పోరాటం చేసినారు.1997 మే 17 న కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ యునైటెడ్ స్టేట్స్ అఫ్ ఇండియా పార్టీ ని స్థాపించారు.1982 లో ఉస్మానియా యూనివర్సిటీ లో భౌతిక శాస్త్రం లో విద్యా భాసనం చేసినారు.1997 లో సూర్యాపేట లో తెలంగాణ మహాసభ పేరుతో లక్ష ల మంది తో కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమం కి వీరన్న ఊపిరి పోశాడు.మేము ఎంతో మాకు అంత రాజ్యాధికారం కావాలని అణగారిన వర్గాలు, తెగలు, జాతులు ను ఐక్యం చేసి చైతన్యం తీసుకురావడంలో క్రియ శీలకంగా పని చేసినారు.సమాజంలో అసమానతలు, అన్యాయం పై నిరంతరం ప్రజలకోసం ధైర్యం గా గళం ఎత్తిన పోరాటాయోధుడు అని వారు అన్నారు.విద్యార్థులను బహుజన రాజ్యాధికారం కోసం కార్యోనులను చేయడం కోసం 1998 ఆగష్టు 18 న బహుజన ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య ను ఏర్పాటు చేయడం జరిగింది.నేటి యువత, విద్యార్థులు, మరోజు వీరన్న ఆశయాలను ఆదర్శం గా తీసుకోని పని చేయాలి అని, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేయాలి అని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో MSF జాతీయ ఉపాధ్యక్షులు తోకల చిరంజీవి, AIOBCSA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల మధు, jvs రాష్ట్ర అధ్యక్షులు చీరాల వంశీ, ఓయూ విద్యార్థి నాయకులు అశ్వన్ శంకర్ యాదవ్, సురేష్, సిద్దు, ప్రభాకర్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. మారోజు వీరన్న గారి ఆశయ సాధన వారికీ ఘనమైన నివాళి అని వారు తెలిపారు