పద్మశాలీల అభివృద్ధికి కృషి చేయాలి
- :హుస్నాబాద్ సంఘ నేతలు
విశ్వంభర, హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర చైర్మన్‌గా గూడూరి శ్రీనివాస్ ఎన్నికైన సందర్భంగా హుస్నాబాద్‌కు చెందిన పలువురు పద్మశాలి నాయకులు సిద్దిపేటలోని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ ద్వారా పద్మశాలి కులాలకు చెందిన బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు. గూడూరి శ్రీనివాస్ రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన నాయకుడని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గాజుల భగవాన్ నేత, చేనేత ఐక్య వేదిక రాష్ట్ర సలహాదారులు చింతకింది శ్రీనివాస్, హుస్నాబాద్ మండల కార్యదర్శి గోలి నారాయణ, మార్కండేయ దేవాలయ ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి లక్ష్మయ్య, ప్రచార కార్యదర్శి చిలుక రాజు తదితరులు పాల్గొన్నారు.