వడదెబ్బతో మహిళ మృతి
- మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలి : సర్పంచి అశోక్
విశ్వంభర, నెల్లికుదురు: వడదెబ్బకు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ తండా సర్పంచి గుగులోతు అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, హనుమాన్ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఈక నాయక్ తండాకు చెందిన గుగులోతు అమృత(54) వ్యవసాయ పనిలో పెసరు చేను కు చెందిన పెసళ్లను ఈనెల 19న ఎండలో తూర్పార పట్టింది. ఇంటికి వచ్చి మంచినీరు తాగి వాంతులు చేసుకుంది. సొమ్మసిల్లి పడిపోయింది దీంతో కుటుంబ సభ్యులు అదే రోజు వరంగల్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు అన్నారు. చికిత్స పొందుతూ గురువారం కన్ను మూసిందని తెలిపారు. మృతురాలికి భర్త, కూతురు,కుమారుడు ఉన్నారు. వడదెబ్బకు గురై మృతి చెందిన రెక్కాడితే గాని డొక్కాడని అమృత కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని సర్పంచ్ అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కష్టాన్ని నమ్ముకుని బతికే కుటుంబంలో కష్టం చేస్తూనే ఎండ దెబ్బకు గురై చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.