టీవైజేఎఫ్ నూతన రాష్ట్ర కమిటీ సభ్యులకు ఘన సత్కారం
విశ్వంభర, సంగారెడ్డి : టీవైజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షేక్ మహబూబ్, వైస్ ప్రెసిడెంట్‌గా తాటికొండ వెంకటేశం, ఆర్గనైజేషన్ సెక్రటరీగా జగత్ కృష్ణ, కోశాధికారిగా యల్ మమత నియమితులైన సందర్భంగా కూన వెంకటగోపాల్ తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ కూన వేణు గోపాల్ మాట్లాడుతూ, యువత సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. టీవైజేఎఫ్ వంటి సంస్థలు యువతకు మంచి వేదికలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులు సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లి యువత సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. షేక్ మహబూబ్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువతకు సేవ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, యువజన ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండీ. అజీజ్ ఖాన్, జీడబ్ల్యూఎంసీ ఈఈ రవికుమార్, హార్టికల్చర్ ఆఫీసర్ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.