దేవాలయాల్లో ఇంకా నగదు చెల్లింపులా..
విశ్వంభర, రామన్నపేట: దేశం మొత్తం డిజిటల్ చెల్లింపుల దిశగా పరుగులు తీస్తున్న వేళ, దేవాదాయ శాఖ పరిధిలోని అనేక దేవాలయాల్లో మాత్రం ఇప్పటికీ నగదు లావాదేవీలే కొనసాగుతూ ఉండదం వల్ల తీవ్ర విమర్శలు భక్తుల నుండి వ్యక్తమవుతున్నాయి. చిన్న టీ దుకాణం నుంచి ప్రభుత్వ సేవల వరకు యూపీఐ, క్యూఆర్ కోడ్ చెల్లింపులు సాధారణమైనా, ఇంకా చాలా ఆలయాల్లో హుండీలు, దర్శనం టికెట్లు, గదుల అద్దె, ప్రసాదాల విక్రయాల్లో నగదుకే ప్రాధాన్యం ఇవ్వడం భక్తులను ఇబ్బందులకు గురి చేస్తోంది. డిజిటల్ లావాదేవీలు పెరిగితే పారదర్శకత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నగదు వ్యవస్థ వలన లెక్కల్లో స్పష్టత లేకపోవడం, బాధ్యతారాహిత్యం పెరగడం, ఆదాయంపై అనుమానాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని భక్తులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శనం, విశ్రాంతి గదుల రుసుముల చెల్లింపుల కోసం తమ వద్ద నగదు లేక, ఎవరి దగ్గర దొరక్క, అకౌంట్లలో డబ్బులు ఉండీ కూడా రుసుముల చెల్లింపుల కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు ఆలయాలు ఈ-హుండీలు, యూపీఐ చెల్లింపులు, ఆన్‌లైన్ సేవలను ప్రవేశపెట్టగా, ఇంకా అనేక దేవాలయాల్లో పాత పద్ధతులే కొనసాగుతున్నాయి. ఆలయాల ఆదాయ, ఖర్చుల వివరాలు స్పష్టంగా నమోదయ్యేలా ఆధునిక చెల్లింపు విధానాలను తప్పనిసరిగా అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు. అన్ని ప్రధాన ఆలయాల్లో క్యాష్‌లెస్ చెల్లింపులు అందుబాటులోకి తెస్తే భక్తులకు సౌలభ్యంతో పాటు వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఈ విషయంపై తక్షణమే స్పందించి, భక్తుల సౌకర్యం, ఆదాయంలో పారదర్శకత, అవినీతి నియంత్రణ కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాల్లో తప్పనిసరిగా క్యాష్‌లెస్ విధానాన్ని అమలు చేయాలని భక్తులు, సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి