v
- కేసుల దర్యాప్తులో నైపుణ్యం తో పని చేయాలి
- అక్రమ రవాణా, అసాంఘిక చర్యల పై పటిష్ట నిఘా
- ప్రజల భద్రత కోసమే నిత్యం తనిఖీ
- ఎస్పి నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గురువారం జిల్లా పోలీసు కార్యాలయం జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ పోలీసు అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల దర్యాప్తులో నైపుణ్యంతో పనిచేయాలని, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసు సేవలను వేగంగా అందించాలని కోరారు. కేసులు పెండింగ్ లేకుండా పనిచేయాలని తెలిపారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల పై పటిష్ట నిఘా ఉంచి నివారించాలని ఆదేశించారు. బాధితుల ఇంటి వద్ద నుండి కేసు నమోదు చేసే విషయంలో అలసత్వం వహించకూడదని డోర్ స్టెప్ ఎఫ్ఫైర్ పటిష్టంగా అమలుకోవాలని సూచించారు. సమీక్ష లో భాగంగా నేరాల నమోదు, పెండింగ్ కేసులు, కోర్టు మానిటరింగ్, శిక్షలు అమలు, డయల్ 100 కాల్స్, బాధితుల ఇంటి వద్ద నుండి కేసు నమోదు, ప్రజా ఫిర్యాదుల పై స్పందన, వాహనాల తనిఖీ, అనుమానిత వ్యక్తుల కదలికలు, రౌడి షిటర్స్ పై నిఘా, రోడ్డు ప్రమాదాల నిర్మూలన, సైబర్ మోసాల్లో నగదు రిఫండ్, దొంగతనాల కేసుల్లో కేసుల డిటెక్షన్ మొదలగు అంశాలను సమీక్షించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. సైబర్ మోసాలపై, మహిళా భద్రతపై అవగాహన కల్పించాలి అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, అక్రమ రవాణా నివారణకు నిత్యం తనిఖీలు చేయాలి అని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సూర్యాపేట డిఎస్పీ ప్రసన్నకుమార్, డి సి ఆర్ బి డిఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ మాగ్దూమ్ అలి, సి ఐ లు వెంకటయ్య, రాజశేఖర్, నాగేశ్వరరావు, రామకృష్ణా రెడ్డి, శివ శంకర్, చరమందరాజు, ఎస్ ఐ లు, సిబ్బంది ఉన్నారు.