ధరల పెంపుతో సామాన్యుడిపై భారం

ధరల పెంపుతో సామాన్యుడిపై భారం

విశ్వంభర, సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తుందని బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పాల సాయిరాం, తదితర నాయకులతో కలిసి గురువారం ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భారీ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఒకే నెలలో రెండుసార్లు ధరలు పెంచడం దారుణమన్నారు. కమర్షియల్‌ గ్యాస్‌పై రూ.1000, డొమెస్టిక్‌పై రూ.500 పెంచారని మండిపడ్డారు. గ్యాస్ ధరల పెంపుతో చిన్నచిన్న హోటళ్లు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్సిడీ ఈ చేతితో ఇచ్చి ఆ చేతితో గుంజుకుంటున్నారని ఫైర్ అయ్యారు. గ్యాస్, చమురు ధరలు తగ్గించాలని లేనిచో పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/burden-on-common-man-with-price-hike/article-15720

Tags: