రాజీవ్ గాంధీ ఆశయాలు యువతకు స్ఫూర్తి
- ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
విశ్వంభర, సూర్యాపేట: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ ఆశయాలు యువత స్ఫూర్తి గా తీసుకొని ముందుకెళ్లాలని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రభుత్వం జనరల్ హాస్పిటల్ లో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, యూత్ టౌన్ అధ్యక్షుడు బొడ్డు సాయి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పండ్ల పంపిణీ కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధి, యువత సాధికారత కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ పునాది వేశారని కొనియాడారు. యువత కాంగ్రెస్ నాయకులు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కావాలని సూచించారు.అనంతరం ఆసుపత్రిలోని రోగులకు, వారి సహాయకులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, శ్రీ దండు మైసమ్మ దేవాలయం చైర్మన్ తంగెళ్ల కర్ణాకర్ రెడ్డి, కౌన్సిలర్స్ కొండపల్లి దిలీప్ రెడ్డి, సునీల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రహీం, అబ్బాస్, మద్దేబోయిన శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.