బండి సంజయ్‌పై బిఆర్ఎస్ అసత్య ప్రచారం మానుకోవాలి
- ఎమ్మెల్యే సతీష్ బాబు ధర్నా హాస్యాస్పదం
- బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ధర్నాపై బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ తీవ్రంగా స్పందించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌పై అసత్య ప్రచారం చేస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలపై అనేక అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు జరిగాయని గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె లిక్కర్ మాఫియా కేసులో జైలుకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశారా అని మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబును ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌పై విషప్రచారం చేస్తే బీజేపీ సహించదని హెచ్చరించారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన బండి సంజయ్ కార్పొరేటర్‌గా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎదిగారని, ఆయనపై ఎలాంటి మచ్చ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు, మహిళల పట్ల కక్షపూరితంగా వ్యవహరించిన సమయంలో బండి సంజయ్ పోరాటం చేశారని, అందుకే ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు. మహిళా అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 12 ఏండ్లుగా కృషి చేస్తోందన్నారు. చట్టంపై విశ్వాసంతోనే బండి సంజయ్ తన కుమారుడు భగీరథ్‌ను పోలీసులకు అప్పగించి విచారణకు సహకరిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో జరిగిన స్కాంలు, అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఒక మాజీ ఎమ్మెల్యే కుమారుడు వాహనంతో అమాయక ప్రజలను ఢీకొట్టి దేశం దాటిపోయినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అలాంటి సందర్భాల్లో ఎందుకు రాజీనామాలు కోరలేదని బీఆర్ఎస్ నాయకులను నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు బోడిగే వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గాదాసు రాంప్రసాద్, కార్యదర్శులు అకోజు అరుణ్ కుమార్, బొప్పిశెట్టి సాయిరామ్, కోశాధికారి బుర్ర రాజు, సీనియర్ నాయకులు తోట సమ్మయ్య, వరియోగుల అనంతస్వామి, అశాడపు శ్రీనివాస్, నాయకులు నగేష్ తదితరులు పాల్గొన్నారు.