ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి
- డిసిసి అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భూఖ్య ఉమా మురళి నాయక్ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది . ఈ సందర్భంగా ఉమా మురళి నాయక్ మాట్లాడుతూ, దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని ఆమె గుర్తు చేశారు . దేశవ్యాప్తంగా “ఉగ్రవాద వ్యతిరేక దినం”గా పాటిస్తున్న సందర్భంగా ప్రతి భారతీయుడు హింసకు వ్యతిరేకంగా, శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు . “సమైక్యతే మన శక్తి - శాంతియుత భారతమే మన లక్ష్యం" అన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని యువత రాజకీయలలో ముందు వుండాలని ఓటు హక్కు కల్పించడం రాజీవ్ గాంధీ, అత్యంత గొప్ప నిర్ణయం, గ్రామీణఅభివృద్ధి కోసం పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, పట్టణాలఅభివృద్ధి పురపాలక చట్టాలను రూపకల్పనచేయడం మహిళలకి 33 % రిజర్వేషన్ ఆలోచనను ముందుకు తీసుకురావడం వంటి సంస్కృరణలుఆయన దూరదృష్టికి నిదర్శనం, సాంకేతిక విప్లవానికి నాంది పలికిన మహానుభావులు రాజీవ్ గాంధీ అని ఆయన సేవలని గుర్తించి ఆయనకు భారతరత్న పురస్కారం ప్రకటించడం జరిగింది అని వారి ఆశయసాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త , కృషి చేయాలని , రాహుల్ గాంధీ ని ప్రధానిని చేయడమే లక్ష్యం గా పని చేయాలని ఆకాంక్షించారు . భారతదేశంలో టెలివిజన్, టెలీకమ్యూనికేషన్స్ విప్లవానికి, కంప్యూటరీకరణకు ఆద్యుడిగా గుర్తింపు పొందారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, యువతకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం పెంచారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుగులోత్ జ్యోతి , రమేష్ నాయక్ , అదేవిధంగా మహబూబాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ పలు వార్డుల ప్రస్తుత కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మహిళా నాయకురాలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ నాయకులు, మైనార్టీ సెల్ నాయకులు, ఎస్టీ సెల్ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు ఓబీసీ సెల్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా మణులు, తదితరులు, పాత్రికేయ మిత్రులు, పాల్గొన్నారు .