నెల్లికుదురు మోడల్ స్కూల్ బాలికల ప్రతిభ
విశ్వంభర, నెల్లికుదురు: స్థానిక మోడల్ స్కూల్ బాలికలు జిల్లా కేంద్రం మహబూబాబాద్ ఐటిఐ కళాశాల లో నిర్వహించిన యువ పార్లమెంటులో అసాధారణ ప్రతిభ కనపరిచారని ప్రిన్సిపాల్ జి.ఉపేందర్ రావు తెలిపారు. కలెక్టర్ స్నేహ శబరిష్, సత్యనారాయణ మూర్తి అనుమతితో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో డి వై ఎస్ ఓ జ్యోతి పర్యవేక్షణలో గురువారం యువ పార్లమెంటు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. యువ పార్లమెంట్ లో 8వ,తరగతి కి చెందిన ప్రవస్థిని పార్లమెంట్ స్పీకర్ పాత్ర, హాసిని,మనస్వి లతోపాటు 7వ,తరగతికి చెందిన సిరివెన్నెల ప్రతిపక్ష సభ్యుల పాత్రలను పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థులు ప్రతిభ కనపరచడానికి కారణమైన యువ పార్లమెంట్ కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహించిన సోషల్ టీచర్ అంజుమ్ సుల్తానాను ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు అభినందించారు. కార్యక్రమ నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించారని అంజమ్ సుల్తానా కృషిని కొనియాడారు. విద్యార్థులు సమాజ సమస్యలపై చర్చిస్తూ ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకునేలా ఈ యువ పార్లమెంట్ ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.