సిటీ పోలీస్ యాక్ట్ అమలు
విశ్వంభర, సిద్దిపేట: కమిషనరేట్ పరిధిలో ఈనెల 23 నుంచి 7వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ గురువారంనాడొక ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని చెప్పారు. కార్యక్రమాల నిర్వహణకు ముందుగా సంబంధిత ఏసీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు. బంద్‌ల పేరిట బెదిరింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారీ సౌండ్లతో కూడిన డీజె సౌండ్ వినియోగించొద్దని, మైక్‌సెట్ తప్పనిసరైతే ఏసీపీ అనుమతి పొందాలని సూచించారు. టీజీపీఎస్సీ పరీక్షలు జరిగే వర్గల్, గౌరారం పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 500మీటర్లలోపు ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని సూచించారు. ఆంక్షలు ఈనెల 23నుంచి 1వ తేదీ వరకు ఉంటాయని తెలిపారు. పరిసరాల్లో కర్రలు, రాళ్లు, ఆయుధాలు, ప్రమాదకరమైన వస్తువులు కలిగి ఉండటం నేరమని, సమీపంలోని జిరాక్స్, ప్రింటింగ్, నెట్ సెంటర్లు మూసేయాలని ఆదేశించారు. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.