మోడల్ స్కూల్ హాస్టల్ ఉద్యోగుల నిరసన
విశ్వంభర, ఖైరతాబాద్ : సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం అని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. గురువారం హైదరాబాదు లకిడికపూల్ లోని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మోడల్ స్కూల్ హాస్టల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లను గట్టిగా వినిపించారు. సిబ్బందికి కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎనిమిది గంటల పనిదినం అమలు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడం, సమాన పనికి సమాన వేతనం చెల్లించడం వంటి అంశాలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు. మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో పాటు కార్మిక హక్కులను పరిరక్షించాలని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో మరింత తీవ్ర స్థాయి ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కమిటీ నాయకులు, వివిధ జిల్లాల మోడల్ స్కూల్ హాస్టల్ ఉద్యోగులు పాల్గొన్నారు.