రైతాంగానికి సాగునీరు ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యం
విశ్వంభర, పెద్ద శంకరంపేట : నారాయణఖేడ్ ప్రాంత రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి కృషి మేరకు కీలక అడుగు పడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయిపల్లి డ్యాం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. మానూర్ మండలం రాయిపల్లి గ్రామంలో సింగూర్ నీటి నిల్వ కొరకు ప్రతిపాదిత డ్యాం నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో కీలక అడుగు పడింది. గురువారం రాయిపల్లి డ్యాం నిర్మాణ పనులను పరిశీలించిన ఇంజనీరింగ్ సిబ్బంద ఎమ్మెల్యే ప్రతిపాదించిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఇంజనీరింగ్ సిబ్బంది డ్యాం నిర్మాణ స్థలాన్ని పరిశీలించడానికి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలు, నీటి నిల్వ సామర్థ్యం, భూసేకరణ డ్యాం డిజైన్‌పై ప్రజలు గ్రామ పెద్దలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రాంత రైతాంగానికి, ప్రజలకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, ఆయన సూచనల మేరకే ఈ రోజు అత్యున్నత స్థాయి అధికారులు ఇక్కడికి వచ్చి పరిశీలన జరిపారని అధికారులు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన తదుపరి నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో చీస్ ఇంజనీర్ రాజమ్మ సూపర్డెంట్ ఇంజనీర్, పోచమల్లు రఘునాథరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుందర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జలేందర్ అసిస్టెంట్ ఇంజనీర్లు విద్యా , ప్రకాష్ ఉన్నారు. అధికారుల వెంట ఈ పరిశీలన కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొని ప్రాజెక్టు ఆవశ్యకతను అధికారులకు వివరించారు. పాల్గొన్న వారిలో మాజీ సర్పంచ్ రాంచందర్, మాజీ ఎంపీటీసీ ధోండి పటేల్, మాష్ పటేల్ రాయిపల్లి గ్రామస్థులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ డ్యాం నిర్మాణం చేపడితే ఈ ప్రాంతం ఎంతో సస్యశ్యామలం అవుతుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రత్యేక చొరవ తీసుకున్న ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.