మాతృమూర్తుల సేవలు సమాజానికి ఆదర్శం : దైవజ్ఞశర్మ

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: హైదరాబాదు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లి సేవలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ నిర్మాణానికి పునాది అవుతాయని తెలిపారు. మాతృమూర్తుల త్యాగాలు, ప్రేమ, మార్గదర్శకత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అసోసియేషన్ చైర్మన్ మరియు అధ్యక్షుడు అర్జున్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మాతృమూర్తులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణ మహిళల అభివృద్ధి ధ్యేయంగా అమ్మ పేరుతో మహిళ సంఘాన్ని  ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యనారాయణ, దేవసేన తదితరులు పాల్గొన్నారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-services-of-matrimurti-are-ideal-for-the-society/article-15691

Tags: