ప్రభుత్వ బడుల బలోపేతానికి బడిబాట
- 100 శాతం ఫలితాలతో ఆదర్శంగా గుండాల జెడ్పీహెచ్‌ఎస్
విశ్వంభర, గుండాల : గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారము ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవన బోయిన ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. గ్రామంలోని పిల్లలను ప్రైవేట్ బడికి పంపకుండా ప్రభుత్వ బడిలో చేర్పించాలని ఉపాధి హామీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులను కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంధం చంద్రకళ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని చెప్పారు గత ప్రస్తుత సంవత్సరము పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించామని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు,, ఉదయం రాగి జావా, వారానికి మూడు కోడిగుడ్లతో మధ్యాహ్న భోజనము అందిస్తున్నామని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆవుల సాయి ప్రసాద్, ఉపాధ్యాయులు గొడుగు బాలరాజు, కళాసికం ఉపేందర్ రావు, మోకాళ్ళ గంగాభవాని, సి ఆర్ పి దేవనబోయిన లింగయ్య, పంచాయతీ సెక్రెటరీ సంతోష్ కుమార్, వార్డు సభ్యులు మైస రమేష్, పండుగ ఉపేందర్, అంగన్వాడీ టీచర్లు రొయ్యల సునీత, అన్నే పర్తి స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.