తాడి మ్యూజికల్ ఫెస్టివల్ రద్దు చేయాలి
విశ్వంభర, హైదరాబాదు : గౌడల సంప్రదాయ వృత్తిని కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అఖిల భారత గౌడ్ సంఘం గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షుడు బందారం అనిల్ గౌడ్ హెచ్చరించారు. ఈ నెల 24న రామ్ దేవ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించేందుకు యత్నిస్తున్న “తాడి మ్యూజికల్ ఫెస్టివల్” గౌడల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. తాటి చెట్టు, కల్లుగీత వృత్తి గౌడల జీవనాధారం మాత్రమే కాకుండా తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని పేర్కొన్నారు. ఒకవైపు కల్లుగీత కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు కార్పొరేట్ వ్యవస్థ తాడి పేరుతో ఈవెంట్లు నిర్వహించి కోట్ల రూపాయల వ్యాపారం చేయాలని ప్రయత్నించడం దారుణమన్నారు. కల్లు అమ్మితే కేసులు నమోదు చేసే ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు తాడి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే ఎందుకు అనుమతులు ఇస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా బీసీల పక్షాన ఉంటే ముందుగా గౌడల జీవన హక్కులను కాపాడాలని, లేకపోతే జరుగుతున్న అన్యాయానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో 24న నిర్వహించనున్న “తాడి మ్యూజికల్ ఫెస్టివల్” కార్యక్రమాన్ని వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను డిమాండ్ చేశారు. గౌడల వృత్తి, సంస్కృతి, ఆత్మగౌరవంపై దాడులు కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టి తగిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు.