బాగ్ లింగంపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవీన్ నాయక్ 

విశ్వంభర, బాగ్ లింగంపల్లి  : హైదరాబాదు లింగంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నవీన్ నాయక్ నియమితులయ్యారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. నవీన్ నాయక్ మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తానని పేర్కొన్నారు. డివిజన్‌లో పార్టీ నాయకులందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ సందర్భంగా తనకు బాధ్యత అప్పగించిన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/naveen-naik-as-congress-president-of-bagh-lingampally-division/article-15689

Tags: