మండు వేసవిలో నిండు చల్లదనం

మండు వేసవిలో నిండు చల్లదనం

  •  మిస్ట్ బస్టాప్ ల ఏర్పాటు 
  • ప్రారంభించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

విశ్వంభర, హనుమకొండ:  హనుమకొండ ప్రజలకు మండు వేసవి బారి  నుండి ఉపశమనం కల్పించే విధంగా హనుమకొండ నగరంలో రెండు మిస్ట్ బస్టాప్ లను ఏర్పాటు చేయగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి గురువారం ప్రారంభించారు. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా ప్రప్రథమంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హనుమకొండ లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రధాన గేట్ పక్కన, పెట్రోల్ పంప్ పబ్లిక్ గార్డెన్ దగ్గర మిస్ట్ బస్టాప్ లను ఎమ్మెల్యే, కలెక్టర్ లు లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం బస్టాప్ లలో ఎమ్మెల్యే, కలెక్టర్, ప్రజలతో కలిసి కూర్చున్నారు.  మిస్ట్ బస్టాప్ లలో మండు వేసవిలోనూ ప్రజల సౌకర్యార్థం చల్లగా ఉండేలా తీర్చిదిద్దారు. అందంగా తయారు చేసిన మిస్ట్ బస్టాప్ లలో ప్రజలు ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందేలా పై కప్పు నుండి సన్నటి నీటి తుంపరలు చల్లగా ఉంచుతాయి. వేసవి దృష్ట్యా వడగాలులు వీస్తుండగా వాటి నుండి రక్షణగా ఈ మిస్ట్ బస్టాప్ లలో చల్లధనానికి కేరాఫ్ గా నిలుస్తున్నాయి. మిస్ట్ బస్టాప్ లలో పైన ఉన్న వెదురు తడకలపై నుండి ప్రత్యేకంగా మోటార్ల ద్వారా పైపుల ద్వారా చిన్నచిన్న నీటి తుంపరలు పడుతుంటాయి. దీంతో బస్టాప్ లో ఉన్న ప్రజలకు శీతల వాతావరణం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరానికి వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు ఎక్కువ సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారని, బస్సులలో వెళ్లేందుకు వేచి చూస్తుంటారని ప్రజల ఆరోగ్యం, భద్రత, ప్రయాణ సౌకర్యం దృష్టిలో ఉంచుకుని మిస్ట్ బస్టాప్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు మిస్ట్ బస్టాప్ లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మిస్ట్ బస్టాప్ లలో చల్లని వాతావరణం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా  ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ ఎండవేడిమి నుండి ప్రజలకు ఉపశమనం కోసం మిస్ట్ బస్టాప్ లను జీడబ్ల్యూఎంసీ నిధులతో రెండింటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పలువురు యువకులు, మహిళలు మాట్లాడుతూ వేసవిలో ఎండలు మండుతున్నాయని, ఎండ వేడిమి నుండి ఉపశమనం కల్పిస్తూ చల్లగా ఉండేవిధంగా కొత్తగా బస్టాప్ లను తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/full-coolness-in-scorching-summer/article-15661

Tags: