సూర్యాపేటలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' జిల్లా స్థాయి కార్యక్రమం 

  •  హాజరుకానున్న మంత్రులు,  స్థానిక ప్రజా ప్రతినిధులు 

 విశ్వంభర, సూర్యాపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజులు "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక"లో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో  జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రకటనలో తెలిపారు. స్థానిక రవిమహల్ ఫంక్షన్ హాల్ వేదికగా ఉదయం 10 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మరియు ఎస్సీ ,ఎస్టీ మైనార్టీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కొత్త పథకాలపై సమగ్ర విశ్లేషణ, వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని సాధించిన విజయాలు, రాబోయే కొత్త పథకాలపై వివరాలను వెల్లడిస్తారన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ, గృహ నిర్మాణ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, రెవెన్యూ , విద్యా, విద్యుత్, పౌరసరఫరాల శాఖలపై సమీక్షి సమావేశంలో అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/public-governance-in-suryapet-progress-plan-district-level-programme/article-15724

Tags: