'ఆదర్శ’లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియేట్‌లో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ అమ్తుల్ జమాల్ అస్రా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియేట్ లో ఎంపీసీ, బైపిసి, సిఇసి, గ్రూపులతో పాటు ఏసీ ఈ కొత్త కోర్స్ ను ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా రోస్టర్ పద్ధతిలో ఎంపిక ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఈ నెల 25 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆమె విద్యార్థులకు సూచించారు.