రామన్నపేటలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి

విశ్వంభర, రామన్నపేట:  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35 వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో గురువారం  మండల కేంద్రంలోని స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి జమీరుద్దీన్ ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, భారత దేశంలో మొట్టమొదటిగా టెక్నాలజీని పరిచయం చేశారని, సమాచార సాంకేతిక పితామహుడిగా పేరు పొందారని అన్నారు. యువత రాజకీయాల్లో రాణించాలని, ఆయన ఆకాంక్షించారని, దేశ భవిష్యత్ కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి డిసిసి సెక్రెటరీ కొత్తపెళ్లి అబ్రహం కుమార్, డిసిసి కార్యనిర్వాహణ కార్యదర్శి గుండాల నరసింహ, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల రాజిరెడ్డి, పున్న జగన్మోహన్, గుత్తా నర్సిరెడ్డి, మొహమ్మద్ నాసర్, జెల్లా వెంకటేశం, రామిని రమేష్, శంబాల వెంకన్న, ఉపసర్పంచ్ మోటే రమేష్, వార్డు సభ్యులు కొమ్ము శేఖర్, కొమ్ము రామస్వామి, మోటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/former-prime-minister-rajiv-gandhis-death-anniversary-was-celebrated-in/article-15632

Tags: