శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భారీ విరాళాలు
విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దక్షిణ మండపం నిర్మాణానికి గ్రామ ప్రజలు, యువత స్వచ్ఛందంగా విరాళాలు అందించడం అభినందనీయమని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్ అన్నారు. తీదేడు గ్రామానికి చెందిన అవిరినేని నరేందర్ రావు, మర్రు రాఘవేందర్ రావు, మర్రు చంద్రశేఖర్ రావు రూ.5,00,116, మోర ధనమ్మ కృపాచారి 1,11,116, బొంతల లలిత 1,00,116, మొరుపోజు లక్ష్మిపతి, మొరుపోజు శంకరాచారిలు 51,116, కండె పద్మ కుమారులు కండె సాయి, కండె నిలేష్ 30,116 విరాళాలు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీ శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దక్షిణ మండప నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఆలయ అభివృద్ధికి గ్రామ ప్రజలు ఐక్యంగా ముందుకు రావడం సంతోషకరమని అన్నారు.