రాజీవ్ గాంధీ ఆశయాలే దేశానికి దిక్సూచి

రాజీవ్ గాంధీ ఆశయాలే దేశానికి దిక్సూచి

  •  వి. హనుమంతరావు

విశ్వంభర, హైదరాబాదు : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు మాట్లాడుతూ, “రాజీవ్ గాంధీ దేశానికి ఆధునిక సాంకేతికతను పరిచయం చేసి యువతకు కొత్త దిశను చూపిన దూరదృష్టి నాయకుడు. గ్రామీణాభివృద్ధి, సమాచార విప్లవానికి పునాది వేసిన నాయకత్వం ఆయనది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత” అని పేర్కొన్నారు. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్ ముదిరాజ్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాగ్ అంబర్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శ్రీధర్ గౌడ్ రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. రాజీవ్ గాంధీ స్మృతిని నిలబెట్టేందుకు రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అవసరమని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్. జగదీశ్వరరావు, యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధి కోటం అనిల్ కుమార్, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత తదితరులు పాల్గొన్నారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rajiv-gandhis-ambitions-are-the-compass-of-the-country/article-15699

Tags: