దేశాభివృద్ధికి రాజీవ్ గాంధీ కృషి అమోఘం
- రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ మండలంలోని కిషన్ నగర్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంక చందు ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంక చందు మాట్లాడుతూ దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి విశేష సేవలు అందించారని తెలిపారు. దేశంలో కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి పునాది వేసి భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక దిశగా తీసుకెళ్లారని అన్నారు. యువతకు ఓటు హక్కు కల్పిస్తూ ఓటు వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేసి గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. విద్యా రంగంలో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అవకాశాలు కల్పించారని చెప్పారు. దేశ సమైక్యత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేసిన దూరదృష్టి నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. అనంతరం ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మండల సర్పంచులు పోరం అధ్యక్షులు పోలు సంపత్, సర్పంచులు వేల్పుల సంపత్, ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షులు బొమ్మగాని రాజు, హుస్నాబాద్ ఏ ఎం సి డైరెక్టర్లు బొంగుని శ్రీనివాస్, పోతుగంటి బాలయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెన్న రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు అలువోజు కుమారస్వామి, పంపర సంపత్, సంఘ శ్రీధర్, బెజ్జంకి బాబు,గాలిపల్లి శ్రీనివాస్, కొడముంజ మహేందర్, రమేష్ నాయక్ ,పోగుల రాజకుమార్, లోకిని యాదగిరి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.