మానవత్వాన్ని చాటుకున్న ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్
విశ్వంభర, మహబూబాబాద్ : స్థానిక పట్టణ కేంద్రంలోని ప్రైవేటు పాఠశాల కృష్ణ వేణి టెక్నో స్కూల్ లో విధులు నిర్వహిస్తున్న బాలినే కవిత టీచర్ భర్త బాలినే ప్రమోద్ ఇటివలే బ్రెయిన్ స్ట్రోక్ కు చికిత్స పొందుతూ హఠాత్తుగా మరణించగా , ఆ కుటుంబానికి మహబూబాబాద్ జిల్లా ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ సభ్యులు అండగా నిలిచారు. గురువారం రోజు ఆమెకు రూ.23,550 ఆర్ధిక సహాయాన్ని అందచేసినారు. టీచర్ కుటుంబ ఆర్ధిక పరిస్థితిని గుర్తించిన అసోసియేషన్ బాధ్యులు, సభ్యులు కవిత కుటుంబాన్ని పరామర్శించి ఆత్మస్థైర్యం కల్పించారు. ఈ సందర్భ గా నిస్సహాయత, నిస్పృహ కు లోనుకావద్దని , పరిస్థితులను ధైర్యముగా ఎదుర్కోవాలని , సంఘము ఎప్పుడూ ఉపాధ్యాయులకు అండగా ఉంటుందని అన్నారు. సహచరుల మధ్య ఐక్యత , మానవత దృక్పథం వల్లనే ఈ సహకారం సాధ్యమైనదని తెలిపినారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్ ప్రెసిడెంట్ గండు మురళి, చేపూరి రవి , సుధాకర్, రాంబాబు, ప్రవీణ్ తో పాటు మైనారిటీ స్కూల్ టీచర్ ఇమాముద్దిన్ మహమ్మద్ పాల్గొన్నారు.