మహిళా కమిషన్ సభ్యురాలిగా శ్వేత 

మహిళా కమిషన్ సభ్యురాలిగా శ్వేత 

విశ్వంభర, సిద్దిపేట: రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన చిట్యాల శ్వేత హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెను శాలువాతో సన్మానించి, స్వచ్ఛభారత్ పితామహుడు గాడ్గే బాబా మెమొంటోను అందజేశారు. కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు శ్వేతకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల సమస్యల పరిష్కారానికి సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఏసీపీ తుమ్మలపల్లి నారాయణ, ముత్యాల నర్సింలు, ఆకారం సత్యం, సుద్దాల రాజు తదితరులు పాల్గొన్నారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/shweta-as-a-member-of-the-womens-commission/article-15718

Tags: