రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు

రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు

విశ్వంభర, సోమాజిగూడ : ఆధునిక భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా హైదరాబాదు నగరంలో పలుచోట్ల ఆయన అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోమాజిగూడలోని విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, జిహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. సాంకేతిక రంగంలో కొత్త దిశను చూపిన నాయకుడిగా గుర్తుచేశారు. నగరంలోని పలుచోట్ల కూడా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించగా, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tribute-to-rajiv-gandhi/article-15657

Tags: