మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి బాధ్యతలు
విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాద్ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలంగాణ రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం తన అనుభవంతో రాష్ట్రస్థాయిలో సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటానాని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త బాధ్యతలతో మహిళా కార్పొరేషన్ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మిని పలువురు మాజీ ప్రజాప్రతినిధులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జి. రామన్ గౌడ్, ముజఫర్, వీణ, వినోద్, రాజేంద్రప్రసాద్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.