జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీ
విశ్వంభర, మహబూబాబాద్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ గురువారం మహబూబాబాద్ పట్టణంలోని దీప్తి హాస్పిటల్, పొనుగోటి హాస్పిటల్, వెన్నెల హాస్పిటల్, వీరభద్ర హోస్పిటల్స్ ని ఆకస్మికం గా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోగుల ప్రయోజనార్థం ప్రతి సేవకు సంబంధించిన రుసుములు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను స్థానిక భాషతో పాటు ఆంగ్ల భాషలో కూడా స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలని, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బయోమెడికల్, పొల్యూషన్, తదితర అవసరమైన లైసెన్సులను స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలని తెలిపారు. అంతేకాకుండా కన్సల్టెంట్ వైద్యుల జాబితాను స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలని అగ్నిమాపక శాఖ (112), పోలీస్ (100), అత్యవసర సేవలు (108) వంటి అత్యవసర మొబైల్ నంబర్లను సంస్థ ప్రాంగణంలో ప్రదర్శించాలని, సూచనల కోసం అవసరమైన సైన్ బోర్డులను ప్రదర్శించాలని, రిజిస్ట్రేషన్ నిబంధనలు పాటించనట్లయితే ఏ సమయంలోనైనా రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుందని అన్నారు. స్కానింగ్ సెంటర్లలలో లింగ నిర్ధారణ పరీక్షలు అనుమతి పొందిన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్ట్ లు మాత్రమే గర్భవతులకు స్కానింగ్ చేయాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత ఆడ మగ అని తెలుపుట చట్టరీత్యా నేరమని , అన్ని స్కానింగ్ సెంటర్లలో స్కానింగ్ చేసే గదిలో వేచియుండు హాలులో తప్పకుండా ఇక్కడ లింగ నిర్ధారణ చెప్పబడదు అనే బోర్డు పెట్టాల్సిందిగా ఆదేశించారు, ఫామ్ -ఎఫ్ ఏరోజువి ఆ రోజే ఆన్లైన్ చేయాలని, ఆన్లైన్ చేసిన అన్ని ఫారం-F లు అన్నీ ప్రతినెల 5వ తారీఖు లోపు జిల్లా వైద్య’ మరియు ఆరోగ్య శాఖా కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు. అలాగే ప్రతి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు దరల పట్టికను ప్రదర్శించాలని, ఫైర్ సేఫ్టీ మెసర్స్ కు సంభందించిన పరికరాలను అమర్చుకోవాలని పేరుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జ్ పి ఓఎంహెచ్‌ఎన్ డాక్టర్ విరాజిత, లోక్య, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.