రాజీవ్ గాంధీకి  ఘన నివాళులు అర్పించిన డిసిసి అధ్యక్షులు, ఎంపీ, ఎమ్మెల్యేలు

విశ్వంభర, హనుమకొండ: మాజీ ప్రధానమంత్రి  రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షులు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నివాళులర్పించే కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి , గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య , పరకాల  శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి  ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాయకులంతా రాజీవ్ గాంధీ  చిత్రపటానికి పూలమాలలు వేసి, దేశానికి ఆయన చేసిన త్యాగాలను, సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. యువతకు ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి భారత ముఖచిత్రాన్ని మార్చిన మహోన్నత నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త దేశ సేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పింగిలి వెంకట్రామ్ నరసింహ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ  ఛైర్మన్  మహమ్మద్ అజీజ్ ఖాన్ , మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు  బంక సరళ , జిల్లా కమిటీ నాయకులు, నాయకురాళ్ళు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎంజీఎం సర్కిల్‌లో నివాళులు అర్పించిన డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి డీసీసీ కార్యాలయ కార్యక్రమం అనంతరం, వరంగల్ ఎంజీఎం సర్కిల్‌ లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు అయ్యూబ్ అలీ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dcc-presidents-mp-mlas-paid-tributes-to-rajiv-gandhi/article-15627

Tags: