వానకొండయ్య గుట్ట మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలి

  • జనగామ జిల్లా కలెక్టర్ కు మెమోరాండం అందజేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

విశ్వంభర, జనగామ:  దేవరుప్పుల మండలం లకావత్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వానకొండయ్య లక్ష్మి నరసింహ స్వామి స్వయానా కొలువైన క్షేత్రం మైనింగ్ మాఫియా చేతిలో పడి ఉనికి కోల్పోతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఘా ను దేవరుప్పుల మండల బిఆర్ఎస్ బృందంతో కలిసి మెమోరాండం అందజేసి గుట్ట మీద జరుగుతున్న మైనింగ్ పర్మిషన్ ను రద్దు చేయాలని కోరారు. గుట్ట వద్ద మైనింగ్ పనులు జరుగుతే అ దేవాలయం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పనులను ఆనాటి సీఎస్ సోమేశ్ కుమార్ గారికి చెప్పి పర్మిషన్ రద్దు చేయించి దేవస్థానం యొక్క మనుగడను కాపాడి 2 కోట్ల రూపాయలతో దేవాలయ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మళ్లీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల అ యొక్క పనులను తిరిగి మొదలుపెట్టారని మండిపడ్డారు. గుట్ట వద్దకు బిఆర్ఎస్ నాయకులు పనులను అడ్డుకావడానికి వెళ్తే మా నాయకుల మీద కేసులు పెట్టి, నోటీసులు పంపించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఏది ఏమైనా వానకొండయ్య గుట్ట మైనింగ్ పనులు ఆపకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్యర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వీటితో పాటు పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తొందరగా కొనుగోలు చేయాలని కోరారు. అలాగే మాదాపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో 30 డబుల్ బెడ్ రూం ఇండ్ల మూడవ విడత బిల్లులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ నాయకులు పల్లా సుందర్ రామ్ రెడ్డి , తీగల దయాకర్, బస్వ మల్లేష్, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, ఏల సోమ సుందర్, దుబ్బాక రత్నాకర్ రెడ్డి, బాషిపాక రాములు ,సుడిగెల హనుమంతు, చింత రవి, ఆనంద్, రాజు,వంగ అర్జున్,భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mining-permission-of-vanakondaiah-gutta-should-be-cancelled/article-15643

Tags: