గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న నేరాలు

గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న నేరాలు

విశ్వంభర, రామన్నపేట:  యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని పరిసర ప్రాంతాలకు ఇటీవల కాలంలో పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుండి వస్తున్న వలస కార్మికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే వీరిలో కొందరు కార్మికుల ముసుగులో జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు మండల ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పట్టణ ఇండ్లలో, రామన్నపేట ప్రాంతంలోని దేవాలయాలలో, ఇండ్లలో చోరీలు, బైకు చోరీలు జరుగుతుండడం ఈ అనుమానాలకు ఆజ్యం పోస్తుంది. ఏదైనా నేరం, దోపిడీ జరిగినప్పుడు సదరు కార్మికుడు రాత్రికి రాత్రే పారిపోతుండటంతో, వారి చిరునామా లేక పట్టుకోవడం కష్టం అవుతుంది. మండలంలోని భవన నిర్మాణ రంగం, హోటళు, రవాణా, ఇటుక బట్టీలు, ఇతర వ్యాపార సంస్థల్లో వేలాది మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. యజమానులు కేవలం తక్కువ కూలీకి దొరుకుతున్నారనే ఉద్దేశంతో వలస కార్మికులను పనుల్లో చేర్చుకుంటున్నారు తప్ప, వారి కనీస వివరాలను సేకరించడం లేదు. కార్మికుల ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు లేదా వారి సొంత ఊరి వివరాల పత్రాలను భద్రపరచడంలో యజమానులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ సమస్య పోలీసులకు పెద్ద సవాలుగా మారుతోంది. కనీసం వారి ఫోటో లేదా సరైన చిరునామా కూడా యజమానుల వద్ద లభించకపోవడం గమనార్హం. నేరాలను అరికట్టడంలో, నిందితులను పట్టుకోవడంలో సీసీ టీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ రామన్నపేట మండలంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మండలంలోని ప్రధాన కూడళ్లలో, కీలకమైన వీధులు, సందులు, వలస కార్మికులు ఎక్కువగా నివసించే కాలనీల పరిసరాల్లో అసలు సీసీ కెమెరాలే లేవు. కొన్ని చోట్ల కెమెరాలు ఉన్నప్పటికీ, సరైన నిర్వహణ లేక అవి కేవలం అలంకరణ కెమెరాలుగా మిగిలిపోయాయి. ఈ నిఘా లోపాన్ని ఆసరాగా చేసుకుని దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, ఇళ్లపై, దేవాలయాలపై దోపిడీలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇటీవల పట్టపగలు ప్రధాన కూడలి నుండి బైక్ చోరి జరిగింది కానీ సీసీ కెమెరాలు (నిఘా నేత్రం) లేనందున బైక్ దొంగిలించిన వ్యక్తిని, బైక్ ని పట్టుకోవడం పోలీసు శాఖ వారికి తలకు మించిన భారంగా తయారయ్యింది. కార్మికులందరినీ తప్పుబట్టలేం కానీ, వారి వివరాలు సేకరించకపోవడం ఖచ్చితంగా భద్రతా లోపమే. ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డును సదరు గ్రామంలోని గ్రామ పంచాయతీ పాలక మండలి విధిగా సేకరించి పోలీస్ స్టేషన్లో వివరాలను నమోదు చేయించాలి. యజమానులు వారి గ్రామంలోని గ్రామ పంచాయతీ పాలక మండలిలో తప్పనిసరిగా వలస కార్మికుల ఐడీ కార్డులను నమోదు చేసి, ఆ వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వాలి. గ్రామ పంచాయతీ, పోలీస్ శాఖలు సంయుక్తంగా వలస కార్మికుల బయోమెట్రిక్ వివరాలతో కూడిన డేటాను రూపొందించాలి. రామన్నపేట మండలంలోని ప్రతి గ్రామంలో, ప్రతి వీధి, జంక్షన్, అనుమానాస్పద ప్రాంతాలలో వెంటనే అధునాతన సీసీ కెమెరాలను(థర్డ్ ఐ) ఏర్పాటు చేయాలి. మండలంలోని ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కలగాలంటే పోలీస్ యంత్రాంగం, గ్రామపంచాయతీ అధికారులు ఇప్పటికైనా తనిఖీలను ముమ్మరం చేసి, నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతం మరింత అశాంతికి నిలయంగా మారకుండా చేయాలని ప్రజలు సంబంధిత పాలక మండళ్ళు, పోలీసు శాఖ వారిని కోరుతున్నారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/increasing-crime-in-rural-areas/article-15722

Tags: