టిఆర్ఎస్ మానుకోట జిల్లా ఇన్ ఛార్జి గా డా.శ్రీకాంత్ గౌడ్
విశ్వంభర, ఇనుగుర్తి: తెలంగాణ రక్షణ సేన(టిఆర్ఎస్)పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జెండా పండుగల నిర్వహణ కోసం జిల్లా ఇంచార్జి లను, నియోజకవర్గాల ఇంచార్జీలను ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జిగా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన డా.నలమాస శ్రీకాంత్ గౌడ్ ను టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు నియమించారు. కష్ట కాలంలో సైతం శ్రీకాంత్ గౌడ్ కల్వకుంట్ల కవితకు జాగృతి సంస్థ నుంచి తోడై నిలబడ్డాడు.ఆ విధేయతే ఈరోజు మానుకోట జిల్లా ఇంచార్జ్ గా నియమించడానికి దోహద పడింది. మానుకోట నియోజకవర్గానికి సీనియర్ నాయకులు గంధ సిరి వేణు, డోర్నకల్ నుండి బోడ అనిల్ నాయక్ ను నియమించారు. ఈ సందర్భంగా డా.శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ చీఫ్ కవితకు కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జెండా పండుగ జిల్లాలోని గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.