రికార్డ్ స్థాయిలో మొక్కజొన్న కొనుగోళ్లు

రికార్డ్ స్థాయిలో మొక్కజొన్న కొనుగోళ్లు

  • ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి పర్యవేక్షణ
  •  మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహశబరీష్

విశ్వంభర, మహబూబాబాద్ : గత వారం రోజుల నుండి జిల్లాలో రికార్డు స్థాయిలో మొక్కజొన్న కొనుగోళ్ల  నిర్వహణలో  మహబూబాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ స్నేహశబరీష్ తెలిపారు. జిల్లా లక్ష్యం 1,37,910 మెట్రిక్ టన్నులు కాగా, ఈ రోజు వరకు మొత్తం 90,220.45 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ జరిగింది. అందులో 84,379.25 మెట్రిక్ టన్నులు గోదాములకు తరలించగా, ఇంకా 5,841.20 మెట్రిక్ టన్నులు గోదాములకు తరలించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈరోజు 4,124.700 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను, అనగా 82,494 బస్తాలను గోదాములకు తరలించటం జరిగిందని, ప్రతిరోజు 25 కేంద్రాల నుండి 300 నుండి 450 ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని తరలించడం కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి ప్రతి గంటకి నివేదికలు తెప్పించుకొని ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దాని ద్వారా పర్యవేక్షణ చేయడం జరుగుతుందని, తద్వారా మార్క్ ఫేడ్, రెవెన్యూ, సహకార వ్యవసాయ అన్ని విభాగాల సమన్వయంతో జిల్లా లక్ష్యాన్ని అతి త్వరలోనే పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ స్నేహా శబరీష్ తెలిపారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/maize-purchases-at-record-levels/article-15709

Tags: