మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీల కష్టాలు
విశ్వంభర, వలిగొండ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన విబిజి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పిస్తూ రోజు కూలి 600 రూపాయలు పెంచాలని రెండుసార్లు ఫోటో తీసే విధానంను రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ,జిల్లా ఉపాధ్యక్షులు సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సంగెం గ్రామంలో ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న పని ప్రదేశంలో జరిగిన కూలీల సమావేశంలో వారు మాట్లాడుతూ, వ్యవసాయ కార్మిక సంఘాలు వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా 2005లో పార్లమెంట్లో చట్టం చేసి 2006 నుండి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అమలులోకి వచ్చిందన్నారు. నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా బడ్జెట్ లో కేటాయించిన నిధులను దారి మళ్లిస్తూ క్రమక్రమంగా నిర్వీర్యం చేసే కుట్ర చేసిందని అందులో భాగంగానే ఇటీవల కాలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మారుస్తూ విబిజి రాంజీ చట్టాన్ని తీసుకొస్తుందన్నారు. ఈ నూతన చట్టంలో ఉపాధి హామీ కూలీలను క్రమంగా పనులకు దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలని కుట్రపూరితమైన విధానాన్ని తీసుకొచ్చింది ఈ విధానంతో రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు చెల్లించని పక్షంలో కూలీలకు పనులు దొరికే పరిస్థితులు లేకుండా చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పని ప్రదేశంలో ఉదయం ఒకసారి,మరో నాలుగు గంటల తర్వాత రెండవ సారి ఫోటో తీసే విధానాన్ని తీసుకొచ్చి వ్యవసాయ కూలీలకు ఈ పని పట్ల అపహస్యం కలిగించే విధంగా బిజెపి నేతృత్వంలో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. నూతన విబిజి రామ్ జి చట్టాన్ని ప్రభుత్వం వెంటనే రద్దుచేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలని అదేవిధంగా బడ్జెట్ లో కేటాయింపులు సక్రమంగా విడుదల చేయాలని. సంవత్సరానికి 200 రోజులు పని దినాలను కల్పిస్తూ రోజు కూలీ 600 రూపాయలకు పెంచాలని,పనిముట్లు గడ్డపార,పార,తట్ట,గొడ్డలి లను కూలీలందరికీ ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు వెంటనే అమలు పరచాలని,కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విబిజీ రాంజీ చట్టాన్ని ఉపసంహరించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల సహాయ కార్యదర్శులు,భీమనబోయిన జంగయ్య, మద్దెల శంకరయ్య, మండల నాయకులు జక్కల అంజయ్య,చేగురి నరసింహ, యాదమ్మ,సుగుణమ్మ,మణెమ్మ,చంద్రయ్య, అనంత లక్ష్మీ, రాధమ్మ, ఎల్లమ్మ, బుచ్చమ్మ, కళమ్మ, అండాలు,లక్ష్మమ్మ,పద్మ, భారతమ్మ,సైదాబీ, మూర్తజా,షబానా,లతీపీ, అనురాధ,మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.