ఎమ్మెల్సీగా బీసీ అభ్యర్థి గెలుపుతోనే బీసీల రాజ్యాధికారం సాధ్యం
విశ్వంభర, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు తమ సంపాదనలో 50 శాతం నిరుద్యోగులు, పట్టభద్రుల కోసం ఖర్చు చేస్తామని బాండ్ పేపర్ రాసి ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ ర్యాలీ నిర్వహించి సింహగర్జన సభ నిర్వహించారు. హరికృష్ణ మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీ గా ఆశీర్వదిస్తే జీతంలో 50 శాతం పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్ సెంటర్, గ్రంథాలయాల్లో మధ్యాహ్న భోజన వసతి వంటి 8 హామీలు అమలు చేస్తానని బాండ్ పేపర్రాసిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ కమిషన్ ఛైర్మన్ కృష్ణమోహన్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీసీ అభ్యర్థి గెలుపుతోనే బీసీల రాజ్యాధికారం సాధ్యమవుతుందని బీఎస్పీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు.



