మోడీ సభ విజయవంతానికి బీజేపీ బైక్ ర్యాలీ

మోడీ సభ విజయవంతానికి బీజేపీ బైక్ ర్యాలీ

విశ్వంభర, ముషీరాబాదు :  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న హైదరాబాదుకు విచ్చేయనున్న నేపథ్యంలో , సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరగనున్న సభను విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాదులోని ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బండి సంజయ్, డాక్టర్ కె లక్ష్మణ్ స్వయంగా బైక్ నడుపుతూ ర్యాలీకి ముందుండి నాయకత్వం వహించారు. వేలాది బైక్‌లతో ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ముషీరాబాదు, చిలకలగూడ, సీతాఫల్ మండి, తార్నాక, మారేడుపల్లి, సికింద్రాబాదు క్లాక్ టవర్, బేగంపేట మీదుగా అమీర్‌పేట్ గురుగోవింద్ స్టేడియం వరకు కొనసాగింది. జై శ్రీరాం, జై తెలంగాణ నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bjp-bike-rally-for-success-of-modi-sabha/article-15120

Tags: