కాంగ్రెస్ పార్టీలోకి కవిత.. మహేశ్ కుమార్ గౌడ్ ఏమన్నారంటే..!!

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న ప్రచారంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న ప్రచారంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో  మాట్లాడుతూ, ఈ ప్రచారానికి ఎలాంటి ఆధారం లేదని ఆయన తేల్చిచెప్పారు. కవిత కాంగ్రెస్‌లో చేరుతారన్న వార్తలు పూర్తిగా ఊహాగానాలేనని, అందులో నిజం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, కవిత చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన ఖండించారు.

బీఆర్ఎస్ పాలనపై కవిత స్వయంగా చేసిన వ్యాఖ్యలే ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతికి నిదర్శనమని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో దోపిడీ, అక్రమాలు జరిగాయంటూ కవితనే ఆరోపణలు చేస్తున్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు వాటిని రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేయడం ఎలా సమంజసం అవుతుందో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

Read More  ఘనంగా 195 వ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు - చేపూరి శంకర్. -మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ 

రాష్ట్రంలో జిల్లాల విభజన తీరుపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గతంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, ఒకే నియోజకవర్గం మూడు లేదా నాలుగు జిల్లాల్లో విస్తరించే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జిల్లాలను ఏర్పాటు చేశారని ఆరోపించారు.

బీజేపీ రాజకీయ భవిష్యత్తుపై కూడా మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. బీజేపీకి గతం తప్ప భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. దేవుడి పేరును ప్రస్తావించకుండా బీజేపీ రాజకీయాలు చేయలేదని, అసలైన హిందువులు కాంగ్రెస్ నాయకులేనని అన్నారు. తాము ఇంట్లో వ్యక్తిగతంగా పూజలు చేస్తామని, ప్రజాజీవితంలో మాత్రం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని స్పష్టం చేశారు.

తనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టంగా చెప్పారు. మంత్రులకు సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చి పాలన సాగిస్తున్నారని అన్నారు. మేడారంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించడం మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు.

సినిమా టిక్కెట్ల ధరల విషయంలో కూడా ఆయన స్పందించారు. ధరలు పెంచకూడదని ప్రయత్నించినప్పటికీ, సినీ పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పార్టీలో ఒకే వ్యక్తికి రెండు నామినేటెడ్ పదవులు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఐఏఎస్ అధికారులపై వచ్చిన ఆరోపణలు వాస్తవ విరుద్ధమని, ఇష్టారీతిన వార్తలు ప్రచురించడం సరికాదని వ్యాఖ్యానించారు. మీడియాలో వచ్చిన అసత్య కథనాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం సరైన నిర్ణయమని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.WhatsApp Image 2026-01-10 at 9.23.59 PM

Tags: