ఘనంగా 195 వ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు - చేపూరి శంకర్. -మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ 

 ఘనంగా 195 వ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు - చేపూరి శంకర్. -మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ 

విశ్వంభర, మంచాల :- భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రిబాయి పూలే జయంతిని బండ లేమూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త,  చేపూరి శంకర్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడపిల్లల చదువు కోసం జీవితాంతం పోరాడిన మహిళా చైతన్యమూర్తి సావిత్రిబాయి పూలే సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, వివక్షలను రూపుమాపేందుకు విశేష కృషి చేశారని అన్నారు. విద్య బోధించేందుకు బడికి వెళ్లే సమయంలో ఆమెపై రాళ్లు, పేడ విసిరినా, రక్తస్రావ గాయాలు అయినా వెనుదిరగలేదని గుర్తు చేశారు. ఆమె భర్త జ్యోతిరావు పూలే ఒక చీరను సంచిలో పెట్టుకుని, ఎలాంటి అవమానాలు ఎదురైనా విద్యను ఆపవద్దని ప్రోత్సహించారని తెలిపారు. యువతీ యువకుల 5కే రన్ 200 మందితో ప్రారంభించి అనంతరం 10వ తరగతిలో 500 మార్కులు సాధించి విలేజ్ టాపర్‌గా నిలిచిన జపాల హారికకు రూ.2,500 చెక్కును, ఇంటర్‌లో 900 మార్కులు సాధించిన భీమనమోని చరణ్ కుమార్‌కు రూ.2,500 చెక్కును అందజేశారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింతగా చదివి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. వీఎంఆర్ లాజికల్ మల్లికార్జున్ మాట్లాడుతూ, రక్తదానం చేసిన 32 మంది రక్తదాతలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నుండి సర్టిఫికెట్లు అందజేశామని తెలిపారు. యువత రక్తదానానికి ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పి. శ్రీనివాస్ నాయక్, ఉపసర్పంచ్ బి. రమేష్, వార్డ్ సభ్యులు ఎల్ మల్లేష్ జరుపుల శోభ, సుజాత, ఎస్. రమేష్, పి. మోహన్, జె. కిషన్, శిరీష, ఎస్. అచ్చరి,  జె. సాలయ్య, మాజీ వార్డ్ సభ్యుడు సుదర్శన్, పి. శివకుమార్, పాటు పెద్ద సంఖ్యలో గ్రామ యువతీ యువకులు, ఈవెంట్ ఆర్గనైజర్లు  జె.రాకేష్ ఎన్ఐఎస్ అథ్లెటిక్స్ కోచ్. శివ శౌర్య పాల్గొన్నారు.

 

Read More ట్రాన్స్‌జెండర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

 

Tags: